V6 News

రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలి..ఎమ్మెల్యే కూనంనేని డిమాండ్ 

రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలి..ఎమ్మెల్యే కూనంనేని డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు: ఈనెల 10న రాష్ట్రానికి వచ్చే ప్రధాని మోదీ.. రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. గురువారం మఖ్దూంభవన్‌‌‌‌లో  మీడియాతో మాట్లాడారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలన్నారు. పెట్రో ఉత్పత్తుల కొరతను నిరసిస్తూ ఈ నెల 4న మండల కేంద్రాల్లో, వడ్ల కొనుగోలుపై శనివారం నిరసనలు చేపడతామన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పునర్నిర్మించాలని, కాళేశ్వరానికి మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీపీఐ స్వాగతిస్తోందని పేర్కొన్నారు.